03 June 2024

పచ్చి ఉల్లిపాయ తింటే ప్రమాదమా.? 

Narender.Vaitla

పచ్చి ఉల్లిపాయ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. షుగర్‌ పేషెంట్స్‌ రోజూ పచ్చి ఉల్లిపాయ తీసుకోవాలని చెబుతున్నారు. 

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు ఉల్లిపాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సల్ఫర్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్‌ స్ట్రోక్ వంటివి రావు.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడి, వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా ఉల్లిపాయ కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే హాని నుంచి రక్షిస్తాయి. 

ఒత్తిడితో ఇబ్బంది పడేవారికి కూడా ఉల్లిపాయ దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫ్లేవనాయిడ్స్‌ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా ఉల్లిపాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌ త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.

ఎముకలను బలోపేతం చేయడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సల్ఫర్, క్వెర్సెటిన్ అనే పదార్థాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

క్యాన్సర్‌ మహమ్మారిని రాకుండా అడ్డుకోవడంలో ఉల్లిపాయ ఉపయోగపడుతుంది. ఇందులోని సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.