ఉల్లిపాయ తింటే.. ఏమవుతుందో తెలుసా.? 

Narender Vaitla

13 Aug 2024

ఉల్లిపాయలో బాక్టీరియల లేదా వైల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉల్లిపాయ కాల్షియం శోషణను పెంచుతుంది, అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని కాపాడుతాయి.

మధుమేహంతో బాధపడేవారు కూడా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయల్లోని క్వెర్సెటిన్ , ఆర్గానిక్ సల్ఫర్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడలో ఉపయోగపడుతుంది. 

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉల్లిపాయ ఉపయోగపడుతుంది. ఇందులోని క్వెర్సెటిన్ అనే రసాయనం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

శరీరంలో రక్తం గడ్డ కట్టడాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడాన్ని విచ్ఛిన్నం చేయడంతోపాటు గుండె జబ్బులు , గుండె స్ట్రోక్‌లను నిరోధిస్తుంది.

పొట్ట ఆరోగ్యం కాపాడడంలో కూడా ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఇనులిన్ అనే ఒక రకమైన ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.