నల్ల జీలకర్రను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను దూరమవుతాయి. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి.
ఇక నల్ల జీలకర్రను తీసుకుంటే మూత్రపిండల సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.
ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో ఇవి బాగా ఉపయోగపడాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
శరీరంలో పేరుకుపోయినా వ్యర్థమైన కొవ్వును కరిగించడంలో నల్లజీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. దీంతో బరువు తగ్గడంలో కూడా దోహదపడుతంది.
రక్తపోటుతో బాధపడేవారు ప్రతీ రోజూ నల్లజిలకర్రను నేరుగా తీసుకున్నా, కషాయం చేసుకొని తాగినా సమస్య నుంచి బయటపడొచ్చనిన నిపుణులు చెబుతున్నారు.
చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా నల్లజిలకర్ర ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దద్దుర్లు, దురద వంటి సమస్యలను దూరం చేయడొచ్చు.
దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో నల్లజీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమస్యలను దూరం చేస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.