09 July  2024

నీరాతో నిజంగా ఇన్ని లాభాలున్నాయా.? 

Narender.Vaitla

గుండె ఆరోగ్యాన్ని రక్షిండచంలో నీరా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నీరాలోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైపర్‌ టెన్షన్‌ను కంట్రోల్‌ చేస్తుంది.

నీరా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో లభించే విటమిన్‌ బీ1 కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నీరాను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

కొన్ని రకాల పరిశోధనల్లో నీరా క్యాన్సర్‌కు చెక్‌ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌కు కారణమయయ్యే ఫ్రీరాడికల్స్‌తో విటిమిన్‌ బి2 పోరాడుతుందని అంటున్నారు.

నీరాలో ఐరన్‌, విటమిన్‌ బీ కాంప్లెక్స్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది.

ఇక షుగర్‌ పేషెంట్స్‌ కూడా నీరాను ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే సుక్రోజ్‌ గ్లూకోజ్‌గా మారడానికి సమయం పడుతుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.

కిడ్నీలో రాళ్లు ఉన్న వారిని నీరా తాగాలని సూచిస్తుంటారు. మూత్ర విసర్జన సాఫీగా సాగడంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.