TV9 Telugu

08 March 2024

కర్బూజ తింటే ఏమవుతుందో తెలుసా.? 

మస్క్ మిలన్ విటమిన్ సికి పెట్టింది పేరు. ఇందులో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వ్యాధుల బారిన పడడం తగ్గుతుంది. 

ఇక కర్బూజలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రతీరోజూ కర్బూజను తీసుకుంటే శరీరంలో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో క్యాన్సర్‌ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుంది. 

రక్తపోటుతో బాధపడేవారు మస్క్‌ మలాన్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. 

ఫైబర్‌కు మస్క్‌ మలాన్‌ పెట్టింది పేరు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇక మస్క్ మలన్‌లోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. ఇది త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. 

కర్బూజలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా కర్బూజ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి, నొప్పులు తగ్గుతాయి. 

ఇక మస్క్‌ మలాన్‌ విటమిన్‌ ఎకి పెట్టింది పేరు. ఇది కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మస్క్‌ మలన్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి సమస్యలు దరిచేరు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.