'లాభాల పుట్ట' గొడుగులు.. 

Narender Vaitla

02 September 2024

పుట్టగొడుగుల్లో ఇర్గోథియోనైన్‌ , సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

పుట్ట గొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్స్‌ క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. దీంతో క్యాన్సర్‌ బారిన పడే అవకాశం తగ్గుతుంది

బరువు తగ్గాలనుకునే వారికి కూడా పుట్టగొడుగులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు శాతం తక్కువ ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. 

పుట్టగొడుగుల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.

బీపీ కంట్రోల్‌లో ఉండాలనుకునే వారు కూడా రెగ్యులర్‌గా పుట్టగొడుగులను తీసుకోవాలి. ఇందులోని మంచి గుణాలు బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.

మెదడు ఆరోగ్యానికి పుట్టగొడుగులు ఉపయోగపడుతాయి. అల్జీమర్స్‌ వంటి సమస్యలు రాకుండా ఉండడంలో సహాయపడుతుంది. మతి మరుపు, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు తగ్గుతాయి.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా పుట్టగొడుగులు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్‌ కంటెంట్‌ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.