08 August 2024

రోజూ పుదీన ఆకులు తింటే.. ఏమవుతుందో తెలుసా.? 

కంటి చూపును మెరుగుపర్చడంలో పుదీన కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో లభించే విటమిన్‌ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఒత్తిడితో ఇబ్బంది పడే వారు పుదీనా ఆకులను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ స్ట్రెస్‌ రిలీఫ్‌గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కడుపు నొప్పి, గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలన్నింటికీ పుదీనా దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం రెండు ఆకులను నమలడం వల్ల మేలు జరుగుతుంది

జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడే వారికి కూడా పుదీనా ఆకులు బాగా ఉపయోగపడతాయి. భోజనం చేసే ముందు రెండు ఆకులను నమిలితే చాలు ఇలాంటి సమస్యలన్నీ పరార్‌ అవుతాయి.

తీవ్రమైన జలుబు, ముక్కు నుంచి శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటే.. పుదీనా వాసనను పీల్చుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

నోటి దుర్వాసనతో బాధపడేవారికి కూడా పుదీనా ఆకులు మంచి రెమెడీగా ఉపయోగపడతాయి. పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్య దూరమవుతుంది.

తరచూ వ్యాధుల బారినపడకుండా ఉండడంలో కూడా పుదీనా ఉపయోగపడుతుంది. ఇందులోని పుష్కలంగా ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.