వెజిటేరియన్స్‌కు మిల్‌మేకర్‌ ఓ వరం.. 

Narender Vaitla

21 September 2024

శరీరంలో చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మిల్‌ మేకర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గుండె జబ్బలు బారిన పడకుండా రక్షించడంలో ఉపయోగపడుతుంది.

ఫైబర్‌ కంటెంట్‌కు పెట్టింది పేరు మిల్‌మేకర్‌. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చు

బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా మిల్ మేకర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ఫైబర్‌ కంటెంట్‌ త్వరగా కడుపు నిండిన భావను కలిగిస్తుంది.

ఇక షుగర్‌ పేషెంట్స్‌కి కూడా మిల్‌మేకర్‌ ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్‌ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్‌ కణాలను అరికట్టడంలో మిల్‌ మేకర్‌ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టడంలో ఎంతో ఉపయోగపడతాయి. 

మిల్‌మేకర్‌లో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. 

మిల్‌మేకర్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో మిల్‌మేకర్‌ ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.