మొక్కజొన్న రొట్టె తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు బలదూర్ అవుతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణాశయాన్ని కాపాడుతుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా మొక్కజొన్న బాగా ఉపయోగపడుతుంది. త్వరగా కడుపు నిండి భావం కలగడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో బరువు తగ్గొచ్చు
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో మక్క రొట్టె ఉపయోగపడుతుంది. మొక్కజొన్న పిండి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి కూడా మక్కరొట్టె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
అధిక బీపీతో బాధపడేవారికి కూడా మక్క రొట్టే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలో కెరోటినాయిడ్లు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
మొక్కజొన్నలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరగలాంటే ప్రతీ రోజూ క్రమం తప్పకుండా మక్క రొట్టే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.