29 July  2024

నిమ్మరసం తాగితే... ఇంత మార్పా..? 

చర్మ సమస్యలకు నిమ్మకాయ రసం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తాజాదనం తీసుకు రావడమే కాకుండా.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా నిమ్మకాయ రసం ఉపయోగపడుతుంది. తక్షణమే ఎనర్జీ లెవల్స్ అందించడంలో నిమ్మకాయ రసం ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా, ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది.

జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా నిమ్మకాయ రసం ఉపయోగపడుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడంతో సహాయపడుతుంది. మలబద్దకం సమస్య ఉంటే వెంటనే పరార్‌ అవుతుంది. 

షుగర్‌ పెషేంట్స్‌కి కూడా నిమ్మకాయ రసం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. నిమ్మరసంతో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.

బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ ఉదయం గోరు వెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. తేనె కూడా కలుపుకుంటే మరింత ప్రయోజకరంగా ఉంటుంది. 

నిమ్మ రసం మూత్రంలో సిట్రేస్‌ స్థాయిలను పెంచుతుంది. ఇది మూత్ర పిండాల్ల రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.

 రక్తపోటును అదుపులో ఉంచడానికి కూడా నిమ్మరసం ఉపయోగపడుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి రక్తపోటును అదుపులో ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.