గొంతు సమస్యలతో బాధపడితే నిమ్మరసం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరంస, తేనె కలుపుకొని తీసుకుంటే తక్షణమే పరిష్కారం ఉంటుంది.
విటమిన్ సికి నిమ్మకాయ పెట్టింది పేరు. దీనిని క్రమంతప్పకుండా తీసుకుంటే నిగనిగలాడే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
నిమ్మకాయ రసంతో శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కిడ్నీలో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే ప్రతీ రోజూ నిమ్మరసాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సాయిటెట్, కాల్షియం క్రిస్టల్‌గా మారకుండా చేస్తుంది.
నిమ్మకాయ లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య దరిచేరకుండా చేస్తుంది.
తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణంకావడంలోనూ నిమ్మ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
ఎండకాలం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడంలోనూ నిమ్మరసం ఉపయోగపడుతుంది. రోజుకు 3 సార్లు నిమ్మరసం తీసుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.