TV9 Telugu

9 April 2024

బెండకాయ ఇలా తింటేనే..  లాభం 

బెండకాయను అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్‌ రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

బెండలో పీచు తక్కువగా ఉంటుంది, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా బెండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని పెక్టిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది

బెండకాయలో విటమిన్‌ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. రోజూ తీసుకుంటే కంటి సమస్యలు రావు.

గర్భిణీలకు ఫోలిక్‌ యాసిడ్ ఎంతగానో అవసరం ఉంటుంది. కాబట్టి బెండకాయను గర్భిణీలు క్రమంతప్పకుండా తీసుకుంటే ఫోలెట్‌ తల్లితో పాటు, బిడ్డకు సంపూర్ణంగా లభిస్తుంది.

క్యాన్సర్‌ను దరిచేరకుండా ఉంచడంలో కూడా బెండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. బెండకాయలోని యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. 

బెండకాయ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌. వారంలో రెండుసార్లు బెండకాయను తీసుకోవాలి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.