జీలకర్ర నీరు తాగితే.. ఏమవుతుందో తెలుసా? 

Narender Vaitla

05 September 2024

పరగడుపున జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది. కడుపులో మంటకు కూడా చెక్‌ పెట్టడంలో దోహదపడుతుంది. 

ప్రతీరోజూ జీలకర్ర నీటిని తీసుకోవడం ద్వారా రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుందని అంటున్నారు. బీపీ కంట్రోల్‌ అవుతుంది.

శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేయడంలో జీలకర్ర నీరు ఉపయోగపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయని చెబుతున్నారు.

డయాబెటిస్‌ బాధితులకు కూడా జీలకర్ర నీరు ఉపయోగపడుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచి, రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా జీలకర్ర నీరు బాగా సహాయపడుతుందని నిపునులు చెబుతున్నారు. ఇందులోని గుణాలు నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

జీలకర్రలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జీవక్రియ రేటును పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.