నేరేడు పండును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ క్రియ రేటును మెరుగుపరుస్తాయి.
బరవు తగ్గాలనుకునే వారికి నేరేడు పండు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. దీంట్లో క్యాలరీలు తక్కువగా ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.
నేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి.
షుగర్ పేషెంట్స్‌కు నేరుడ పండ్లు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నేరేడు పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో పాటు నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. ఇది దాహం తగ్గిండచంలో ఉపయోగపడుడుతంది. అలాగే శరీరం చల్లబడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో నేరేడు పండు ఉపయోగపడుతుంది. ఇందులోని సోడియం, కాల్షియం, ఐరెన్ వంటి గుణాలు వ్యాధుల బారినపడకుండా చూడడంలో ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో నేరేడు పండు సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా లభించే పొటాషియం అధిక రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.