రోజూ బెల్లం తింటే ఏమవుందో తెలుసా.? 

22 January 2024

TV9 Telugu

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి బెల్లం దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. బెల్లంలోని మంచి గుణాలు శ్వాసనాళాల శుద్ధికి దోహదపడతాయి. కాలుష్య కారకాలను తొలగిస్తాయి.

రోగ నిరోధక పెరగడంలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. కాలుష్యం వల్ల తలెత్తే ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి రక్షించడంలో బెల్లం ఉపయోగపడుతుంది. 

జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బెల్లం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దరి చేరవు. 

శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. మెటబాలిజంని క్రమబద్దీకరించడంలో బెల్లం ఉపయోగపడుతుంది.

బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మేలు చేస్తుంది. చర్మానికి మెరుపునిచ్చి మొటిమలని నివారిస్తుంది. 

బెల్లంలోని సహజ గుణాలు.. జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి ఉపశమనం ఇస్తుంది. బెల్లాన్ని చాయ్‌లో వేసుకొని తాగినా మేలు చేస్తుంది. 

బెల్లం ద్వారా శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే, బెల్లం తీసుకుంటే వెంటనే శక్తి స్థాయిలు పెరుగుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.