01 June 2024

జామ పండు తినండి.. మార్పు  మీరే గమనించండి. 

Narender.Vaitla

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలనుకునే వారు నిత్యం జామ పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు రాళ్లు రాకుండా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

హైబీపీతో బాధపడేవారు కచ్చితంగా జామపండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జామపండు వల్ల సోడియం, పొటాషియం పాళ్లు సమతూకంగా ఉంటాయి. ముఖ్యంగా హైపర్‌ టెన్షన్‌ తగ్గుతుంది.

జామపండు ఫైబర్‌కు పెట్టింది పేరు. జామపండును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. గ్యాస్‌ సమస్యలకు దూరమవుతాయి.

బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా డైట్‌లో జామపండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.

చర్మ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కచ్చితంగా జామకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల చర్మం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి.

రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో జామపండు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు పుష్కలంగా ఉండడం వల్ల వ్యాధుల బారిన తక్కువ పడతారు.

మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలకు జామ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.