TV9 Telugu
19 April 2024
జామకాయ ఎక్కడ కనిపించినా.. వెంటనే తినేయండి
జామలోని విటమిన్ సి, లైకోపీన్ యాంటీ యాక్సీడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జామలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జామకాయను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య దూరమవుతుంది.
జామకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది బ్లెడ్ ప్రెజర్ సమస్యకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
ఇక జామలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. దీంతో క్యాన్సర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
జామలో ఉండే పోషకాలు ట్రైగ్లి రాయిడ్స్ చేడు కొవ్వును తగ్గించటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
జామపండులో లభించే విటమిన్ -ఎ కంటిచూపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కేటరాక్ట్ వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది.
జామ ఫోలిక్ యాసిడ్‌కు పెట్టింది పేరు. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే తల్లి కావాలనుకునే వారు కూడా జామ తీసుకుంటే మంచి జరుగుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..