పచ్చి బఠానీ తింటే జరిగే మార్పులివే..

Narender Vaitla

21 September 2024

ఫైబర్‌ కంటెంట్‌కు బఠానీలు పెట్టింది పేరు. దీంతో బరువు తగ్గడంలో బఠానీలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి తింటే కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది.

డయాబెటిస్‌ పేషెంట్స్‌కి కూడా పచ్చి బఠానీలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉండడం వల్ల ను రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

గుండె ఆరోగ్యానికి కూడా పచ్చి పిఠానీలు మేలు చేస్తాయి. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పచ్చి బఠానీ దోహదపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గర్భిణీలకు కూడా పచ్చి బఠానీ ఎంతో మేలు చేస్తుంది. బేబీ మెదడు, వెన్నుపూస అభివృద్ధి చెందేందుకు ఫోలేట్ ఉపయోగపడుతుంది. ఇది బఠానీలో పుష్కలంగా ఉంటుంది.

పచ్చి బఠానీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. అంతేకాదు, పిల్లల శరీరాభివృద్దికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.