పంపర పనస.. ఎక్కడ కనిపించినా తినేయండి
Narender Vaitla
10 Aug 2024
రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌సి తక్కువగా వ్యాధుల బారిన పడేలా చేయడంలో ఉపయోగపడుతుంది.
ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ పండును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని జీర్ణ ఎంజైమ్‌లు జీర్ణక్రియ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రుచికి తియ్యగా ఉన్నా ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లకు పెట్టింది పేరు పంపర పనస. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముడతలు, గీతలు లాంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సాయపడుతాయి
పంపర పనసనకు రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు తగ్గే అవకాశాలు భారీగా తగ్గుముఖం పడతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..