గోంగూర ఆకులో విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది.
గుండె జబ్బులు దరిచేరకుండా ఉంచడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
డయాబెటిస్ పేషెంట్స్‌కి కూడా గోంగూర దివ్యౌషధంగా చెప్పొచ్చు. గోంగూరను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
ఇక గోంగూరు ఫైబర్‌కు కూడా పెట్టింది పేరు దీంతో గొంగూరను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతమై, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
మెరుగైన కంటి చూపు కోసం ప్రతీ రోజూ గోంగూరను తీసుకోవాలి. ఇందులోని విటమిన్ ఎ దృష్టి లోపాలను తగ్గిస్తుంది. విటమిన్ ఎ రెటీనా, కంటి వెనుక భాగంలో సున్నితమైన కణజాలాన్ని కాపాడుతుంది.
గోంగూర కాల్షియంకు పెట్టింది పేరు. అందుకు గోంగూరను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బలమైన ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తల కణాల ఉత్పత్తికి దోహద పడుతుంది. శరీరంతో ఆక్సిజన్ రవాణా చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.