నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
ఊపిరిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండే వారికి బాగా ఉపయోగపడుతుంది.
కంటి ఆరోగ్యం మెరుగుపడడంలో కూడా నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు తగ్గుతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.