గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా వెల్లుల్లి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
వెల్లుల్లి నేచురల్ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. నొప్పిగా ఉన్న కీళ్లపైన వెల్లుల్లి నూనెతో మసాజ్ చేసుకుంటే నొప్పి ఇట్టే దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వెల్లుల్లిని తీసుకోవాలి. కడుపులోని ప్రమాదకరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో వెల్లుల్లి క్రీయాశీలకంగా ఉపయోగపడుతుంది.
తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు లాంటి సమస్యలకు వెల్లుల్లితో చెక్ పెట్టొచ్చు.
శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోపగుడుతంది. వెల్లుల్లికి శరీరంలోని కొవ్వుల స్థాయిలను తగ్గించే శక్తి ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది.
చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై మొటిమలను, మచ్చలను తగ్గిస్తాయి.
క్యాన్సర్‌ను తరిమికొట్టే దివ్యౌషధం వెల్లుల్లి. వెల్లుల్లిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల భవిష్యత్తుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.