23 May 2024

రోజూ చేపలు తింటే ఏమవుతుందో తెలుసా.? 

Narender.Vaitla

చేపల్లో విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఎన్నో నాణ్యమైన ప్రొటీన్లు, కొవ్వులు శరీరానికి మంచిచేస్తాయి. విటమిన్‌-డి కూడా పుష్కలంగా లభిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు ఇతర నాన్‌వెజ్‌ కంటే చేపలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. చేపల్లో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది.

మెదడు ఆరోగ్యానికి మేలు చేయడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్‌ వంటి వ్యాధులకు చెక్‌ పెట్టడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయి.

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కండ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. వయసుతో పాటు వచ్చే దృష్టి లోపాలు తగ్గడంలో చేపలు ఉపయోగపడతాయి.

వారానికి రెండు సార్లు చేపలు తినడం వల్ల హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చేపల్లో లభించే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

చేపలలో విటమిన్‌ ఇ పుష్కలంగా లభిస్తుంది. అలాగే వీటిలో లభించే సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్‌ లభిస్తాయి. కేశ, చర్మ సమస్యలు దరిచేరవు.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా చేపలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెదడులోని సెరోటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరగడానికి సహాయపడతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.