చేప గుడ్లతో.. చెప్పలేనన్ని లాభాలు. 

Narender Vaitla

07 November 2024

చేప గుడ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు సమస్యను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరవని చెబుతున్నారు. 

మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా చేప గుడ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేప గుడ్లు తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా చేప గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కంటి సమస్యలను దూరం చేస్తాయి.

చేప గుడ్లు గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె జబ్బులను నివారిస్తుంది.

చేప గుడ్లను రెగ్యులర్‌గా తీసుకుంటే క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు. మహిళల్లో వచ్చే బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు.

చేప గుడ్లలోని ఎన్నో పోషకాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో తరచూ వ్యాధుల బారిన పడే అవకావం తగ్గుతుంది.

చేపల గుడ్లలో విటమిన్ డి, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.