వారంలో ఒక్కరోజైనా చేపలు తినాల్సిందే..

Narender Vaitla

15 September 2024

చేపల్లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే చేపలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలకు కూడా చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు ఒత్తిడిని దూరం చేసి. ప్రశాంతతను ఇస్తాయి.

చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుపడుతుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని  పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

కీళ్ల నొప్పులను తరిమికొట్టడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

క్యాన్సర్ ను తరిమికొట్టడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ దారిచేరానివ్వదు.

మహిళల్లో రుతు క్రమ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే తరచూ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీలు చేపలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో బిడ్డకు మంచి ప్రోటీన్లు అంది వారి మెదడు బాగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.