06 September 2023

ఫైబర్ రిచ్‌ ఫుడ్స్ తో ఆరోగ్యం సొంతం   

గట్‌ ఆరోగ్యానికి  అలాగే అధిక బరువు పెరగకుండా ఉంచడంలో ఫైబర్‌ గొప్ప పాత్ర పోషిస్తుంది.  ఫైబర్ -రిచ్ ఫుడ్స్‌ డైట్‌లో చేర్చుకోవాలి. 

ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచుతాయి.  మలబద్దకాన్ని నివారించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. .

సబ్జా గింజల్లో పీచు అధికంగా ఉంటుంది. సబ్జా గింజలను నానబెట్టుకుని గ్రీన్ టీలో కానీ సలాడ్‌పై కానీ చల్లుకుని  తీసుకోవచ్చు 

 జామకాయలో విటమిన్ సితో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటి పవర్‌ని పెంచడంలో సహకరిస్తుంది 

మైదాపిండి కంటే గోధుమలను నేరుగా మరాడించి పిండిగా మార్చుకుని దానితో పుల్కాలను తయారుచేసుకుంటే చాలా మంచిది 

పాప్ కార్న్ లో  కావాల్సిన ఫైబర్ లభిస్తుంది. రుచిగా, తేలికగా ఉండే పాప్ కార్న్ బరువు తగ్గాలనుకునే వారికి మంచి స్నాక్‌

పండ్లను జ్యూస్ ల రూపంలో తాగటం కన్నా నేరుగా తినటం ద్వారా ఎక్కువ మొత్తంలో శరీరానికి ఫైబర్ లభిస్తుంది.

బీరకాయ పొట్టులో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. దోసకాయను పొట్టు తీయకుండా సలాడ్‌లో చేర్చుకోవడం మంచిది 

బాదం, పిస్తా, వాలనట్స్‌లో ఫైబర్ ఎక్కువ. అయితే వీటిని నేరుగా కాకుండా నానబెట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం ఉత్తమం.