06 June 2024

కంటి ఆరోగ్యం ఇలా పదిలం.. 

Narender.Vaitla

కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో పొద్దు తిరుగు విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులోని విటమిన్ ఇ  కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఇక ఆకు కూరలు కూడా కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా బచ్చలి, కాలే, కొల్లార్డ్ ఆకు కూరల్లో విటమిన్‌ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. 

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటా సాల్మన్‌, ట్యూనా వంటి ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కళ్ల ఏఎమ్‌డీ గ్లాకోమా నుంచి కాపాడుతాయి.

రాత్రిపూట దృష్టిని పెరగాలంటే తక్కువ కొవ్వు.. ఎక్కువ ఫైబర్‌, జింక్‌ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉపయోగపడుతాయి.

విటమిన్‌ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రెటినాలోని సున్నితమైన రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది.

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్డును ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ బి2 కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో నేరేడు పండ్లు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్రో పోషిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచరం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం