గులాబీ రేకులను రోజూ తీసుకుంటే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుందని దీంతో బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడడంలో కూడా గులాబీ రేకులు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ఉపయోగపడతాయి.
గులాబీ పువ్వులలో యాంటీ-ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇవి చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.
లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో గులాబీ రేకులు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో శుక్ర కణాల నాణ్యత పెరుగుతుంది.
రక్తపోటుతో బాధపడేవారు ప్రతీ రోజూ గులాబీ రెక్కలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో బీపీ క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
గులాబీ రెక్కల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటిని తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.