05 July  2024

రోజూ రెండు పుదీన ఆకులు నమలండి చాలు.. 

Narender.Vaitla

కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కల్పించడంలో పుదీన ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ ఉదయం పుదీనా ఆకులను తీసుకుంటే కండరాల నొప్పి తగ్గుతుంది.

ప్రతీ రోజూ రెండు పుదీనా ఆకులను నమిలితే కిడ్నీలు శుభ్రమవుతాయి. కిడ్నీ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవాలి.

పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయేరియాను తగ్గిస్తాయి, కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.

పుదీనా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులుచెబుతున్నారు. పేగులను శుభ్రం చేయడంలో ఉపయోగపడతాయి.

పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాలతో వ్యతిరేకంగా పోరాడుతాయి. పుదీనాను ప్రతీరోజూ తీసుకుంటే రొమ్ము, నోటి క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు.

పుదీనా రసంగా తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. షుగర్‌ పేషెంట్స్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇక పుదీన ఆకుల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతీ రోజూ ఉదయం రెండు నుంచి 4 పుదీనా ఆకులను నమిలితే బీపీ పరార్‌ అవుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.