రాత్రి త్వరగా తింటే.. ఏమవుతుందో తెలుసా.?
Narender Vaitla
07 October
2024
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు రాత్రి 8 గంటలలోపు భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో తీసుకున్న ఆహారం జీర్ణమై మంచి నిద్ర సొంతమవుతుంది.
గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం కారణమని నిపుణులు అంటున్నారు. రాత్రి త్వరగా తింటే ఈ సమస్య దూరమవుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రి 8 గంటలలోపు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి తిన్నది త్వరగా జీర్ణమైతే మంచి నిద్ర సొంతం చేసుకోవచ్చు.
బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే రాత్రుళ్లు త్వరగా భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెటబాలిజం పెగరడంతో పాటు బరువు తగొచ్చు.
డయాబెటిస్‌కు కూడా రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడమే కారణమని వైద్యులు చెబుతుంటారు. త్వరగా తింటే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి తగినంత సమయం లభిస్తుంది.
గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా రాత్రి త్వరగా తినడం దోహదపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ఆగిపోతుంది.
రాత్రుళ్లు త్వరగా భోజనం చేయడం చేయడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. త్వరగా భోజనం చేసే ఉదయం వరకు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..