ఎండు కొబ్బరి కూడా మంచిదే.. 

Narender Vaitla

18 Aug 2024

ఎండు కొబ్బరిలో ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

అల్జీమర్స్‌, ఒత్తిడి వంటి మానసిక సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఎండు కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

ఎండు కొబ్బరిని, బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్‌ లభిస్తుంది. ఇది రక్త హీనత సమస్యను దూరం చేస్తుంది.

భవిష్యత్తులో క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే ఎండు కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గుణాలు క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి. 

శరీరంలో చెడు కొలెస్ట్రాల స్థాయిలు పెరగకుండా ఉంచడంలో ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

జుట్టు రాలడం, వెంట్రుకలు తెల్లబడడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా ఎండు కొబ్బరి దివ్యౌషధంగా చెప్పొచ్చు. ఎండు కొబ్బరి తీసుకునే జుట్టు సమస్యలు తగ్గుతాయి. 

ఎండు కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం హైడ్రేట్‌గా ఉంచడంలో ఎండు కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధిచి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.