TV9 Telugu

2 April 2024

ఈ పండు ఎక్కడ కనిపించినా తినేయండి.. 

డ్రాగన్‌ ఫ్రూట్ ఫైబర్‌కు పెట్టింది పేరు. ఈ పండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు బలదూర్‌ అవుతాయి. మలబద్ధకం దరిచేరదు.

ఇందులోని మెగ్నీషియం కంటెంట్‌ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది.

డ్రాగన్‌ ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి దీంతో క్యాన్సర్‌ కణాల వృద్ధి నశిస్తుంది

డ్రాగన్‌ ఫ్రూట్‌లోని ఫైబర్‌ కారణంగా కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇది బరువు తగ్గడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్‌ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

కీళ్ల నొప్పులు తగ్గించడంలో కూడా డ్రాగన్‌ ఫ్రూట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోపగుడుతంది. 

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్‌ బి, ఫోలేట్, ఐరన్‌లు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. తల్లితో పాటు కడుపులో బిడ్డకు ఎంతగానో మేలు చేస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.