TV9 Telugu

28 April 2024

గాడిద పాలకు ఇందుకేనా  అంత డిమాండ్‌.. 

గాడిద పాలు పోషకాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా చిన్నారుల్లో వచ్చే ఉబ్బసం, ఆస్తమా వంటి సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతంది.

ఇక గాడిద రోజుకు కేవలం లీటర్‌ పాలు మాత్రమే ఇస్తుంది అందుకే వీటికి అంత డిమాండ్‌ ఉంటుంది. అలాగే గాడిద పాలను సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. 

గాడిద పాలలో విటమిన్‌ డీ పుష్కలంగా లభిస్తుంది. దీంతో అర్థరైటిస్‌ వంటి సమస్యలతో బాధపడేవారికి గాడిదల పాలు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.

ఇక గాడిద పాలలో ఉండే మంచి గుణాలు దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్లతోపాటు గాయాలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

దురద, తామర వంటి చర్మ సంబంధిత సమస్యలకు సైతం గాడిద పాలు దిద్యౌషధంగా ఉపయోగపడాతయని నిపుణులు చెబుతున్నారు.

ఇక గాడిద పాలతో  ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌, షాంపూ, లిప్‌బామ్‌, బాడీవాష్‌... వంటి కాస్మెటిక్స్‌ తయారుచేస్తుంటారు అందుకే వీటికి అంత డిమాండ్‌ ఉంటుంది.

మెరుగైన జీర్ణక్రియను అందించడంలోనూ గాడిద పాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోబయోటిక్స్‌ జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.