రోజుకు 30 నిమిషాలు సైకిల్ తొక్కండి.. తేడా మీరు చూడండి.
ప్రతీ రోజూ సైక్లింగ్ చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె, శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.
అధిక శరీర బరువుతో ఇబ్బందులు పడేవారికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజు 30 నిమిషాలు సైక్లింగ్ చేస్తే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
సైక్లింగ్ వల్ల శరీంలోని దాదాపు అన్ని కండరాలు సక్రమంగా పనిచేస్తాయి. దీంతో కండరాలు బలంగా మారి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
సైక్లింగ్ చేయడం వల్ల జీవ క్రియ మెరుగువుతుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతీ రోజూ ఉదయం సైక్లింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలి.
ప్రతీ రోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన చిత్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆనందానికి కూడా దోహదపడుతుంది.
ఇక డయాబెటిస్‌తో బాధపడే వారికి కూడా సైక్లింగ్ బెస్ట్ ఆప్షన్‌గా నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ చేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా సైక్లింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయాలని సూచిస్తున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.