ఈసారి వీటిని అస్సలు వదకలండి.. 

Narender Vaitla

24 September 2024

సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కచ్చితంగా తీసుకునే ఆహారంలో సీతాఫలాలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషయం గుండెకు మేలు చేస్తుంది.

ఇక సీతాఫలాల్లో పొటాషియం సైతం పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తపోటు వచ్చే సమస్య నుంచి పూర్తిగా బయటపొచ్చని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వీటిలో పుష్కలంగా ఉండే కాపర్ మలబద్ధకాన్ని తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా సీతాఫలం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని మెగ్నీషియం కీళ్లలోని యాసిడ్స్‌ను బయటకు తరిమేస్తుంది.

గర్భిణీలకు కూడా సీతాఫలం మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. పిల్లలకు జన్మనిచ్చే సమయంలో నొప్పులను నివారించడంలో సీతాఫలం కీలకంగా పనిచేస్తుంది.

సీతాఫలం తియ్యగా ఉండడం వల్ల డయాబెటిస్ వీటిని తీసుకోవచ్చా.? లేదా అన్న సందేహంతో ఉంటారు. అయితే ఇందులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 54 కాబట్టి డయాబెటిస్‌ ఉన్న వారు కూడా తినొచ్చు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.