పండే కాదు.. ఆకులతో కూడా లాభాలే 

Narender Vaitla

18 October 2024

సీతాఫలం ఆకులను టీ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎసిడిటీ, గ్యాస్‌ సమస్యులు దూరమవుతాయి. 

డయాబెటిస్‌ పేషెంట్స్ కూడా సీతాఫలం ఆకులు ఉపయోగపడతాయి. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సీతాఫలం ఆకులను కాచి చల్లార్చి తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సమ్మేళనాలు రక్తపోటును నియంత్రిస్తాయి.

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. సీతాఫలం ఆకులను పేస్టుగా మార్చుకొని చర్మంపై అప్లై చేయాలి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారికి కూడా ఈ ఆకులు ఉపయోగపడతాయి. ఆకులను మెత్తగా నూరి నొప్పులుండే చోట అప్లై చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

సీతాఫలం ఆకుల నీటిని తీసుకుంటే లివర్‌ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని మంచి గుణాలు లివర్‌ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.