కరివేపాకులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొవ్వును కరిగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో సులువుగా బరువు తగ్గవచ్చు.
కరివేపాకు నీటితో జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థకు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా దరిచేరనివ్వదు.
కరివేపాకు హైపోగ్లైసమిక్
లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పరిగడుపున కరివేపాకు నీళ్లను తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయులు కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది.
గుండెకు హాని కలిగించే ఎల్‌డీఎల్
కొలెస్ట్రాల్ స్థాయులు కరివేపాకు నీళ్లు తాగిస్తాయి. దీంతో గుండె సంబంధ వ్యాధులు తగ్గుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.
వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంచడంలో కరివేపాకు నీరు ఎంతగానే ఉపయోగపడుతుంది. కరివేపాకు నీటిని రోజూ తీసుకోవడం వల్ల జుట్టు కుదుర్లు బలోపేతమవుతాయి.
కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్
తో పోరాటం చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సహజసిద్ధంగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది.
పరగడుపున కరివేపాకు నీళ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వకుండా శరీరాన్ని కాపాడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.