కరివేపాకును ఏరేస్తున్నారా.? 

Narender Vaitla

25 Aug 2024

జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కరివేపాకును కచ్చితంగా తీసుకోవాలి. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగురుస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకును నేరుగా నమలడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగువుతుంది.

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తుంది. రోజూ ఉదయం టీకి బదులుగా కరివేపాకుతో చేసిన టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో జుట్టు ఎదుగుదలకు ప్రేరేపించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు బలంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

ప్రతీ రోజూ ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ తరచూ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. 

బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ప్రతీ రోజూ కరివేపాకు నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పరగడుపున ఈ నీటిని తీసుకుంటే.. ఇట్టే బరువు తగ్గొచ్చు.

చర్మం ఆరోగ్యం పదిలంగా ఉంచడంలో కూడా కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.