TV9 Telugu
20 April 2024
కరివేపాకును తీసి పారేయకండి..
కరివేపాకును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. ముఖ్యంగా అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తి జరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు దివ్యౌషధంగా చెప్పొచ్చు. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది.
కరవేపాకులో హైపర్గ్లైసీమిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కారణంగా డయాబెటిక్ బాధితుల రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తాయి.
కంటి ఆరోగ్యం కాపాడడంలో కూడా కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో రక్తపోటుతో బాధపడేవారికి ఎంతో ఉపయోగపడుతుంది.
అతిసారంతో బాధపడేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కార్బజోల్ ఆల్కలోయిడ్లలో అతిసారాన్ని నివారిస్తుంది.
కాలేయాన్ని సంరక్షించడంలో కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇందులోని కార్బాజోల్ ఆల్కలాయిడ్లు హెపటైటిస్, సిర్రోసిస్‌లు లివర్‌ను సంరక్షిస్తాయి
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..