03 June 2024

రోజూ పెరుగు తినండి..  బిందాస్‌గా ఉండండి.

Narender.Vaitla

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పెరుగులోని ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

కడుపులో మంట, అజీర్తి వంటి ఎన్నో రకాల జీర్ణ సంబంధిత సమస్యలకు పెరుగు చక్కటి పరిష్కారంగా చెప్పొచ్చు. క్రమంతప్పకుండా పెరుగు తీసుకుంటే ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

చర్మం ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మం మెరిసేలా చేయడంలో పెరుగు ఉపయోగపడుతుంది.

షుగర్‌ పేషెంట్స్‌ ఎలాంటి భయం లేకుండా పెరుగును తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత, గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ కచ్చితంగా పెరుగును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీంతో బరువు తగ్గొచ్చని చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.