06 August 2024

దోసకాయను కచ్చితంగా  తినాల్సిందే.. 

కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో దోసకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

 అజీర్ణం సమస్యతో బాధపడేవారికి దోసకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే నీటి కంటెంట్, ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది.

ఎముకలను బలంగా మార్చడంలో కూడా దోసకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ కె ఎముకలు బలంగా ఉండటానికి, సాంద్రత పెరగటానికి తోడ్పడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో దోసకాయను భాగం చేసుకోవాలని. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది.

మధుమేహంతో బాధపడేవారికి కూడా దోసకాయ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. దోసకాయ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేస్తుందన్నమాట.

క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకట్టవేయడంలో కూడా దోసకాయ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లివర్‌, రొమ్ము, లంగ్స్‌ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు.

రక్తపోటు బాధితులకు దోసకాయ దివ్యౌషధం. ఇందులోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.