నవ్వితే ఒత్తిడి దూరమవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుందని అందరికీ తెలిసిందే. అందుకే నవ్వడం ఒక భోగం అని చెబుతుంటారు.
నవ్వడం కోసం ఏకంగా లాఫింగ్ క్లబ్‌లను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో నవ్వడం కోసం నానా కష్టాలు కూడా పడుతుంటారు. నవ్వు ఆరోగ్యంపై అంతలా ప్రభావం చూపుతుంది మరి.
అయితే కేవలం నవ్వు మాత్రమే కాదని, ఏడుపు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే.
కన్నీళ్లు పెట్టడం ద్వారా మానసికంగా ధృఢంగా ఉంటారని వైద్యనిపుణులు చెబుతున్నారు. గుండె ధైర్యం కూడా వస్తుందని సూచిస్తున్నారు.
ఏడిచినప్పుడు భావోద్వేగాలు అదుపులో ఉంటాయని, మానసిక ప్రశాంతత కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కూడా పరార్ అవుతుందని చెబుతున్నారు
ఏడ్చినప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. దీని వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక బాధ నుంచి ఉపశమనం పొందుతారు.
కన్నీళ్లు కారడం వల్ల కళ్లు సహజంగా శుభ్రమవుతాయి. కళ్లలో పడిన దుమ్ముతో పెరిగే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది.
పై తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించనివని మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.