13 July  2024

కొత్తిమీర పడేస్తున్నారా.? 

Narender.Vaitla

గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవ్వాలంటే కొత్తిమీర దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొత్తిమీర ఆకులు నమిలినా మంచి ప్రతిఫలం ఉంటుంది.

నోటి దుర్వాసన, నోటి అల్సర్‌, పగుళ్లు వంటి సమస్యలతో బాధపడేవారు కొత్తిమీర ఆకులను నమలడం వల్ల ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా కొత్తిమీర దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొత్తి మీర రసంలో తేనె కలుపుకొని తీసుకుంటే మంచి లాభం ఉంటుంది.

గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఇది గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

కొత్తిమీర విటమిన్‌ కేకి పెట్టింది పేరు. కాబట్టి కొత్తిమీరను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఆస్టియోపోరోసిస్ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చు.

క్యాన్సర్‌ వంటి మహమ్మారిని తరిమికొట్టడంలో కూడా కొత్తిమీర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కణాలను దెబ్బతీయకుండా కాపాడుతాయి.

రక్తపోటుతో బాధపడేవారికి కూడా కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో ఉండే అదనపు సోడియంను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.