TV9 Telugu
2 April 2024
కొత్తిమీరను లైట్
తీసుకుంటున్నారా.?
కొత్తిమీరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
కొత్తమీరలో మెగ్నీషియం, ఇనుము, మాంగసీన్ పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకుంటే కొవ్వు తగ్గుతుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమన్వయపరుస్తుంది.
కొత్తమీరలో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
లివర్ సంబంధిత సమస్యలకు కూడా కొత్తమీర ఎంతగానో ఉపయోగపడుతంది. ముఖ్యంగా కామెర్లు వంటి కాలేయ వ్యాధులను నయం చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్‌కు కొత్తమీర పెట్టింది పేరు. దీంతో కొత్తమీరను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రక్తపోటు నియంత్రించడంలో కూడా కొత్తిమీర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అనవసరమైన సోడియంను తొలగిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటిచండమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..