TV9 Telugu

22 April 2024

ఇన్ని సమస్యలకు కొబ్బరి  నీళ్లు ఒక్కటే పరిష్కారం.. 

కొబ్బరి నీళ్లలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వెంటనే కడుపు నిండి భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు. 

కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు రక్తపోటును తగ్గిస్తాయి.

ఇక యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలకు కొబ్బరి నీళ్లు పెట్టింది పేరు. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంతో కీలక పాత్ర పోషిస్తుంది.

గర్భిణీలకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు కొబ్బరి నీళ్లు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.

కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కూడా కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఇక కొబ్బరి నీటిలో సోయం, చక్కెరలు తక్కువగా.. క్లోరైడ్, క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూస్తుంది

కండరాల తిమ్మిరి సమస్యతో బాధపడే వారు కొబ్బరి నీరు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే అధిక పొటాషియమే దీనికి కారణం

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.