కొబ్బరి పువ్వు కనిపిస్తే వెంటనే తినేయండి.. 

Narender Vaitla

23 October 2024

కొబ్బరి పువ్వును తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గిపోతాయి.

గుండె సంబంధిత సమస్యల బారినపడకుండా ఉంచడంలో కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పొటాషియం కంటెంట్‌ గుండె సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.

బీపీని కట్రోల్‌ చేయడంలో కూడా కొబ్బరి పువ్వు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపు చేయడంలో కీలక పాత్ర పోసిస్తుందని నిపుణులు అంటున్నారు.

మీరు డయాబెటిస్‌ బాధుతులా అయితే కొబ్బరి పువ్వును కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్ రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది.

కొబ్బరి పువ్వులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఇక కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలు నష్టపోకుండా రక్షిస్తుంది. క్యాన్సర్‌ కణాల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరి పువ్వును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.