03 March 2024

లవంగాలతో లాభాలెన్నో.. 

TV9 Telugu

ప్రతీ రోజూ భోజనం చేసిన వెంటనే లవంగం తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. అజీర్తి కూడా దూరమవుతుంది

అలాగే లవంగాన్ని క్రమం తప్పంకుడా తీసుకుంటే ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. 

లవంగాలను నిత్యం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లవంగంలోని సుగుణాలు కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి. 

పంటి సంబంధిత సమస్యలకు కూడా లవంగం దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని యుజైనాల్ తైలం యాంటీసెప్టిక్ లా పనిచేసి పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది. 

పలు అధ్యయనాల ప్రకారం లవంగాలు బ్లడ్ షుగర్‌ లెవల్స్‌ని కూడా కంట్రోల్‌ చేస్తాయని తేలింది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 

లవంగాలు యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలకు పెట్టింది పేరు. ఈ గుణాలు బీపీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇక లవంగాల్లోని సుగుణాలు రక్తనాళాలు బాగా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండె సమస్యలు దరిచేరవు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.