బరవు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను నోట్లో వేసుకొని నమలాలి. దీనివల్ల బరువు తగ్గొచ్చు.
డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.? అయితే ప్రతీ రోజూ ఒక చిన్న లవంగం ముక్కను తీసుకోండి. ఇందులోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.
పురుషుల్లో వచ్చే సంతానోత్పత్తి సమస్యలకు దాల్చిన చెక్క ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అంగస్తంభన సమస్య ఉన్న వారికి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి ముఖంపై మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకుంటే మచ్చలు ఇట్టే తొలగిపోతాయి. చర్మ సమస్యలు దూరమవుతాయి
మెరుగైన జీర్ణక్రియకు దాల్చిన చెక్క ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ దాల్చిన చెక్కను నమిలితీ అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి
అల్జీమర్స్ వంటి సమస్యలను దూరం చేయడంలో దాల్చిన చెక్క కీలకపాత్ర పోషిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
ఛాతిలో మంట, గుండె సంబంధిత సమస్యలు దూరమవ్వాలంటే దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.