04 June 2024

మీ వంటింట్లో దాల్చిన చెక్క ఉందా.? 

Narender.Vaitla

బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క దివ్యౌషధంగా చెప్పొచ్చు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్తంలో చెక్కర స్థాయిలను కంట్రోల్‌ చేయడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజు దాల్చిన చెక్కను నమిలితే షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

శ్వాస సంబంధిత సమస్యలకు దాల్చిన చెక్క దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ దాల్చిన చెక్క తీసుకోవాలని సూచిస్తున్నారు

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గడం, మందంగా మారడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

ఆర్థరైటిస్‌ సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్క నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో కొన్ని దాల్చిన చెక్క ముక్కలను వేసుకొని తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం