ధర తక్కువ.. లాభాలు ఎక్కువ 

Narender Vaitla

18 September 2024

పల్లిపట్టిలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శీరారానికి కావాల్సిన శక్తి ఇన్‌స్టాంట్‌గా లభిస్తుంది. వీటిలో పుష్కలంగా ఉండే కేలరీలు, కార్బోహైడ్రేట్ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. 

రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పల్లి పట్టీలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఖనిజాలు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో తరచూ జబ్బు పడడం తగ్గుతుంది.

ఇక పల్లిపట్టీల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ప్రతీ రోజూ పల్లి పట్టీలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భినీ స్త్రీలు ఇవి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.

పల్లి పట్టీల్లో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో మల బద్ధకంతో పాటు ఇతర కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

ఎముకలను దృఢంగా మార్చడంలో పల్లిపట్టిలు ఉపయోగపడతాయిడు. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడతాయి.

పల్లిపట్టిల్లో మెగ్నీషియం కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో ప్రతీ రోజూ పల్లిపట్టీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.